Thursday, January 23, 2025

వివాదానికి దారితీసిన ‘రాష్ట్రపత్ని’ వ్యాఖ్య

- Advertisement -
- Advertisement -

Adhir Ranjan

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’ అని సంబోధించినందుకు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి బిజెపి ఆగ్రహానికి గురయ్యారు. ‘భారత రాష్ట్రపత్ని అందరికీ…’ అంటూ చౌదరి చేసిన వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాక ఆయన విపక్షాలు గురువారం మరోసారి రాష్ట్రపతి భవన్‌కు మార్చ్ చేస్తాయని కూడా అన్నారు. గురువారం ఉభయసభలు సమావేశం కాగానే, బిజెపి అధిర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. గందరగోళం మధ్య ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా బిజెపి ఎంపీలు గురువారం చౌదరికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. కాగా బిజెపి క్షమాపణ డిమాండ్‌కు చౌదరి జవాబిస్తూ ‘క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. నేనేదో పొరపాటున ‘రాష్ట్రపత్ని’ అన్నాను…అధికార పార్టీ కావాలని గోరంతలు కొండంతలు చేస్తోంది’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News