Monday, December 23, 2024

ఆది, నిక్కీల నిశ్చితార్థం

- Advertisement -
- Advertisement -

Adi Pinchetti is engaged to Nicki Galrani

 

హీరో ఆది పినిశెట్టి నిశ్చితార్థం హీరోయిన్ నిక్కీ గల్రానీతో ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు కొంత మంది బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఆది పినిశెట్టి ఓ పోస్ట్ పెట్టాడు. “నా జీవితంలో చెప్పుకోదగ్గ మంచి విషయం ఏంటంటే.. కొన్నేళ్ల క్రితం మేం ఒకరికీ, మరొకరం పరిచయం అయ్యాం. ఇరు కుటుంబాల సమక్షంలో మా నిశ్చితార్థం ఈనెల 24న ఘనంగా జరిగింది. కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాం. అందుకు మీరందరూ ఆశీస్సులు, దీవెనలు అందించాలి” అని ఆది పినిశెట్టి ఇన్‌స్టాగ్రామ్ లో పేర్కొన్నాడు. ‘యాగవరాయినుం నా కాక్క’ అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టితో కలిసి నిక్కీ నటించింది. ఈ చిత్రం తెలుగులో ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఈ మూవీ చేస్తున్నప్పుడే ఆది, నిక్కీల మధ్య ప్రేమ చిగురించింది. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News