Sunday, December 22, 2024

మా కుమారై విషయంలో నవీన్ రెడ్డి సైకో: యువతి తల్లిదండ్రులు

- Advertisement -
- Advertisement -

తమ కుమారై విషయంలో నవీన్ రెడ్డి సైకోగా వ్యవహరించాడని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కూతురు కిడ్నాప్ విషయంతో వారు మీడియాతో మాట్లాడుతూ… తమ కుమారైను సొంతం చేసుకునేందుకు నవీన్ నాటకాలాడారని తెలిపారు. తమ కూతురుకు నవీన్ రెడ్డికి పెళ్లైనట్లు నమ్మించేందుకు కుట్ర చేశారని చెబుతున్నారు. గతేడాది ఆగస్టు 27న వివాహమైందని ప్రచారం చేసుకున్నారని వెల్లడించారు. తన భార్యను పంపించట్లేదని ఎల్బీనగర్ కోర్టులో నవీన్ రెడ్డి పటిషన్ వేశాడు.

వాహనం కొనుగోలు చేసి నామినీగా భార్య పేరు రాయించుకున్నాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆ పత్రాల ఆధారంగా కోర్టులో నవీన్ రెడ్డి పిటిషన్ వేశాడు. ఆగస్టు 27న కుమారై అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉందన్నారు. నవీన్ రెడ్డి పెళ్లి విషయంలో అబద్ధం చెబుతున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందిన బిల్లులే దానికి నిదర్శనమని చెబుతున్నారు. నవీన్ రెడ్డి, యువతి కలిసి దిగిన ఫొటోలు పెళ్లి ప్రచారానికి వాడుకున్నాడని మండిపడ్డారు. నకిలీ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పలువురికి నవీన్ రెడ్డి ఫొటోలు పంచించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే యువతి కిడ్నాప్ కేసులో పోలీసులు నవీన్ రెడ్డితో పాటు మరో 20 మందిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News