Monday, December 23, 2024

యువతి కిడ్నాప్ కేసు.. నవీన్‌రెడ్డి తల్లిదండ్రులకు అస్వస్థత

- Advertisement -
- Advertisement -

ఆదిబట్ల పోలీసు స్టేషన్ పరిదిలోని తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిదిలోని మన్నేగూడ యువతి కిడ్నాప్ కేసులో నిందితుడు నవీన్ రెడ్డి తల్లిదండ్రులు అస్వస్థకు గురయ్యారు. నవీన్ తల్లిదండ్రులు కోటిరెడ్డి, నారాయణమ్మ అనారోగ్యానికి గురైయ్యారు. శనివారం ఉదయం నిందితుడి తండ్రి కోటిరెడ్డి ఆసుపత్రిలో చేరగా, తల్లి నారాయణమ్మ ఇంట్లో అస్వస్థకు గురైంది.

నిన్న మధ్యాహ్నం నుంచి నారాయణమ్మ ఆహారం తీసుకోకపోవడంతో అనారోగ్యం బారిన పడింది. బిపి పెరగడంతో కోత్తపేట ఓమ్ని ఆస్పత్రికి తరలించారు. నవీన్ రెడ్డి తల్లి మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేసింది. నవీన్ రెడ్డి, యువతి రెండేళ్లుగా కలిసి తిరిగారు. మా ఇంటికి కూడా యువతి చాలాసార్లు వచ్చింది. యువతిని పెళ్లి చేసుకున్నట్లు నవీన్ రెడ్డి మాకు చెప్పాడు. నవీన్ తన వ్యాపారానికి సంబంధించిన డబ్బులు యువతి తండ్రికి ఇచ్చేవాడని నారాయణమ్మ పేర్కొంది.

నిన్న యువతి ఇంటిపై జరిగిన దాడి తప్పే. అంతకుముందు జరిగిన విషయాలపై పోలీసులు దృష్టి పెట్టాలని నారాయణమ్మ కోరింది. నవీన్ రెడ్డి వ్యాపారం కోసం చాలా కష్టపడేవాడు. ఒక్కోసారి 10 రోజులు కూడా ఇంటికి వచ్చేవాడు కాదు. కష్టపడిపైకి ఎదిగిన నా కుమారుడిని యువతి ఇష్టపడిందని ఆమె మీడియాతో తెలిపింది. దాడి సమయంలో వాడిన ఒక కారు, బొలెరో వాహనాన్ని ఎల్బీనగర్ SOT పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News