Sunday, December 22, 2024

మంత్రి ఉన్నా.. ఆదిలాబాద్ ప్రజలకు ఇల్లు రాలేదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరుందుకున్నాయి. ఆదిలాబాద్ బిఆర్ఎస్, బిజెపి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. ఆదిలాబాద్ కు బిఆర్ఎస్ చేసిందేం లేదని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాను కాంగ్రెస్ పార్టీ దత్తత తీసుకుంటుందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గృహనిర్మాణ శాఖ మంత్రి ఉన్నారు.

మంత్రి ఉన్నా ఆదిలాబాద్ ప్రజలకు ఇల్లు రాలేదని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అధికారంలోకి రాగానే పేదల ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు ఇస్తామన్నారని రేవంత్ గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే రూతులకు రూ. 2 లక్షలు రుణమాఫీ, అధికారంలోకి రాగానే రూ. 500కే గ్యాస్ సలిండర్, అధికారంలోకి రాగానే మహిళకు బస్సులో ఉచిత ప్రయాణం అన్నారని ఆయన విమర్శించారు. ఆదిలాబాద్ లో 8 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపించండని రేవంత్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News