Thursday, January 23, 2025

కాంగ్రెస్ కు ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడి రాజీనామా

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్ డిసిసి అధ్యక్షుడు సాజిద్ ఖాన్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఆయనతోపాటు మరికొందరు నేతలు కూడా అదే బాటను అనుసరించారు. ఆదిలాబాద్ టికెట్ ను కాంగ్రెస్ అధిష్ఠానం శ్రీనివాసరెడ్డికి కేటాయించడంతో అలిగిన సాజిద్ రాజీనామా చేశారు. ఎంతో ఆవేదనతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. కాగా శ్రీనివాసరెడ్డిపై పోటీగా సంజీవరెడ్డిని బరిలోకి దించాలని సాజిద్ తో పాటు అసమ్మతి నేతలు భావిస్తున్నట్లు తెలిసింది. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు భాగ్య కూడా రాజీనామా చేశారు. ఆమె మంత్రి వేముల ప్రశాంత్  రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News