Wednesday, January 22, 2025

కుప్టి ప్రాజెక్టు పూర్తి చేసి ఆదిలాబాద్‌ను సస్యశ్యామలం చేస్తాం: రేవంత్

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: కుప్టి ప్రాజెక్టు పూర్తి చేసి ఆదిలాబాద్‌ను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్‌లో కొత్తగా విశ్వవిద్యాలయం ప్రారంభిస్తామని, కాంగ్రెస్ హయాంలోనే ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమను నిర్మించామన్నారు. మోడీ-కేడీ కలిసి ఆదిలాబాద్‌లోని సిసిఐ పరిశ్రమను మూసివేశారని, త్వరలోనే సిసిఐ పరిశ్రమను తెరిపిస్తామని హామీ ఇచ్చారు. తుమ్మిడిహట్టిలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కడుతామని, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించి, అంబేడ్కర్ పేరు పెడతామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి సుగుణకు మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేపట్టారు. జనజాతర సభల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 24 గంటల్లోనే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించామని, ఇప్పటివరకు 35 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారన్నారు.

కాంగ్రెస్ హయాంలో రూ.400కే గ్యాస్ సిలిండర్ అందించామని, పేదలకు అండగా నిలబడినవారికి కాంగ్రెస్‌లో అవకాశాలు ఉంటాయని, తెలంగాణలో ప్రజాపాలన మొదలైందని, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఐదు అమలు చేశామని, త్వరలోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాగోబా జాతరకు నాలుగు కోట్ల రూపాయలు కేటాయించాలని నిర్ణయించామన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ప్రారంభించారని, కెసిఆర్ ప్రభుత్వం రాగానే రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని రద్దు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగోట్టాలని పిఎం మోడీ, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అంటున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News