Sunday, January 19, 2025

భార్య ఆత్మహత్య చేసుకుందని భర్త పురుగుల మందు తాగి

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: నవదంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని కొల్హరి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పది నెలల క్రితం మహారాష్ట్రకు చెందిన పల్లవిని కొల్హరి గ్రామానికి చెందిన విజయ్ పెళ్లి చేసుకున్నాడు. దంపతులు ఇద్దరు కలిసి మెలిసి జీవనం సాగిస్తున్నారు. గత కొంత కాలంగా భార్య అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా పల్లవి తన పుట్టింటికి వెళ్లింది. పండుగ తరువాత పల్లవి అన్నయ్య ఆమెను అత్తగారింటి వద్ద వదిలి వెళ్లిపోయాడు. భర్త విజయ్ తన తల్లితో కలిసి పొలం పనులకు వెళ్లాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో పల్లవి పురుగుల మందు తాగింది, గ్రామస్థుల సమాచారం మేరకు పల్లవిని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆస్పత్రికి తరలించారు. భార్య మృతికి తానే కారణం అనే అపవాదం వస్తుందనే భయంతో గ్రామ శివారులోకి వెళ్లి విజయ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News