Saturday, November 16, 2024

‘నాకు టికెట్ రాకుండా చేస్తున్నది మంత్రి పెద్దిరెడ్డే’

- Advertisement -
- Advertisement -

వైసీపీలో మరో అసమ్మతి రాగం వినిపిస్తోంది. సత్యవేడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ పార్టీపై ఆరోపణలు చేశారు. ప్రధానంగా మంత్రి పెద్దిరెడ్డిపై ఆయన విరుచుకుపడ్డారు. రానున్న ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా పెద్దిరెడ్డి అడ్డుపడ్డారని  అన్నారు. సిఎం జగన్ తనను పిలిచి లోక్ సభకు పోటీ చేయాలని అడిగారని, అయితే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడానికి రెండు కారణాలు చెప్పాలని తాను అడిగానని చెప్పారు. అయినా సరే తిరుపతినుంచి ఎంపీగా పోటీ చేయాలని ఖరాఖండీగా చెప్పారని, ఈ అంశంపై రెండు నెలలుగా తనను క్షోభ పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సత్యవేడులో మంత్రి పెద్దిరెడ్డి అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారని అన్నారు. సత్యవేడు నియోజకవర్గ ఆత్మీయ సమావేశాన్ని మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో నిర్వహించడాన్ని ఆయన తప్పుపట్టారు. తనకు ఇష్టం లేకపోయినా లెక్కచేయకుండా తిరుపతి ఎంపి స్థానానికి పెద్దిరెడ్డిని ఇంచార్జిగా ప్రకటించారు. భూమన కరుణాకర్ రెడ్డి, రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి నియోజకవర్గాలకు ఇలా ప్రకటించగలరా? అని ఆయన నిలదీశారు. 1989లో పెద్దిరెడ్డి మోటార్ సైకిల్ పై తిరిగేవారనీ, ఆయన ఆస్తులు ఇప్పుడు ఇంతలా ఎలా పెరిగాయని ప్రశ్నించారు. మాజీ మంత్రి చెంగారెడ్డిని అడిగితే అప్పట్లో పెద్దిరెడ్డికి ఏమాత్రం ఆస్తులుండేవో చెబుతారని సురేష్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News