Wednesday, January 22, 2025

పాన్ వరల్డ్ లెవెల్లో ‘ఆదిపురుష్’

- Advertisement -
- Advertisement -

‘Adipurush’ at Pan World Level

 

పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ లెవెల్ వరకు మంచి స్పాన్ ఉన్న హీరో ఎవరు అంటే అది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పాలి. ఇప్పుడు పాన్ ఇండియాతో పాటు పాన్ ఆసియా లెవెల్ వరకు కూడా భారీ క్రేజ్ ఉన్న ఈ స్టార్ హీరో వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాల్లో భారీ చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ని డైరెక్ట్‌గా పాన్ వరల్డ్ లెవెల్ ప్రాజెక్ట్‌గా ప్రకటించడం విశేషం. అయితే ఇప్పుడు దీనికన్నా ముందే ప్రభాస్ అడుగు పాన్ వరల్డ్ లెవెల్లో తన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’తో వేయనున్నాడట. లేటెస్ట్‌గా మేకర్స్ క్లారిటీ ఇస్తూ ఈ సినిమాని అన్ని భాషలతో పాటుగా ఇంగ్లీష్‌లో కూడా డబ్ చేస్తున్నామని, ఇప్పటికే పలు హాలీవుడ్ సంస్థలతో కూడా మాట్లాడుతున్నామని చెప్పడం విశేషం. మరి ఈ సినిమాలో భారీ ఖర్చుతో గ్రాఫికల్ వర్క్ పర్ఫెక్ట్‌గా చేసినట్టు, తప్పకుండా పాన్ వరల్డ్ లెవెల్లో ఈ సినిమా హిట్ అవుతుందని చెబుతున్నారు ఫిల్మ్‌మేకర్స్. మరి ఈ చిత్ర దర్శకుడు ఓంరౌత్ ‘ఆదిపురుష్’తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News