Thursday, January 16, 2025

ఆదిపురుష్ డైలాగ్ రైటర్ మనోజ్ శుక్లా క్షమాపణలు

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రజల మనోభావాలను గాయపరిచినందుకు ఆదిపురుష్ చిత్ర మాటల రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ప్రభాస్ కథానాయకుడిగా ఓం రౌత్ దర్శకత్వం గత నెల విడుదలైన ఆదిపురుష్ చిత్రంలో కొన్ని పాత్రలు పలికే సంభాషణలు ప్రజల ఆగ్రహాన్ని చవిచూశాయి. ఎట్టకేలకు చిత్రంలోని సంభాషణల పట్ల ప్రజలకు క్షమాపణలు చెప్పిన మనోజ్ శుక్లా కొన్ని డైలాగులను మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఆదిపురుష్ చిత్రం ప్రజల మనోభావాలను గాయపరిచినట్లు తాను అంగీకరిస్తున్నానని శనివారం ఆ చిత్ర డైలాగ్ రైటర్ మనోజ్ శుక్లా శనివారం ప్రకటించారు. చేతులు జోడించి ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానంటూ ఆయన ప్రకటించారు. మన పరమ పవిత్ర సనాతన ధర్మాన్ని, ఇంతటి గొప్ప దేశాన్ని సేవ చేసే బలం తనకు ఇవ్వాలని ఆ ప్రభు బజరంగ్ భళిని ప్రార్థిస్తున్నానని ఆయన ఈ్వట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News