Wednesday, January 22, 2025

డైలాగ్‌లు వివాదాస్పదం.. పోలీసు భద్రత కోరిన ఆదిపురుష్ రైటర్

- Advertisement -
- Advertisement -

ముంబై : ఆదిపురుష్ మాటల రచయిత మనోజ్ ముంతషిర్ శుక్లా తనకు భద్రత కావాలని ముంబై పోలీసులను కోరారు. ఇటీవల విడుదలైన భారీ స్థాయి సినిమా ఆదిపురుష్ పలు విషయాలలో వివాదాస్పదం అయింది. రామాయణాన్ని , ఇందులోని పాత్రలను కించపరిచే విధంగా ఈ సినిమా డైలాగులు ఉన్నాయని విస్తృతస్థాయిలో దూషణలు , విమర్శలు

ఎదురుకావడంతో , తనకు కొన్ని శక్తుల నుంచి ప్రాణహాని ఉందని పేర్కొంటూ ఈ రైటర్ ముంబై పోలీసులను ఆశ్రయించాడు.డైలాగ్‌లపై దుమారం చెలరేగడంతో వీటిలో కొన్నింటిని తొలిగించివేస్తామని చిత్ర నిర్మాతలు, దర్శకులు ముందుకు వచ్చారు. తనకు భద్రత కల్పించాలని ఇప్పుడు ఈ రచయిత కోరడంతో దీనిపై ఎటువంటి చర్య తీసుకోవాలనేది స్థానిక పోలీసు అధికారులు నిర్ణయించాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News