Sunday, February 23, 2025

ఈనెల 30 నుంచి ఆదిపురుష్ ప్రమోషన్స్ మొదలు..

- Advertisement -
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిన ఈ మూవీ జూన్ 16న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 30వ తేదీ శ్రీరామ నవమి నుంచి చిత్రయూనిట్ దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు. ఈ సందర్బంగా దర్శకుడు ఓమ్ రౌత్, నిర్మాత భూషణ్ కుమార్ మాతా వైష్ణో దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి ఆశిస్సులు అందుకున్నారు.

Adipurush movie promotions will start from March 30

ఇందులో ప్రభాస్ శ్రీ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించబోతున్నారు. హనుమంతుడుగా సన్నీ సింగ్ నటించాడు. చెడుపై గెలిచిన మంచిని చూపిస్తూ.. ఆధునిక కాలానికి అన్వయించి రాబోతోన్న ‘ఆదిపురుష్’తో ప్రభాస్ మరో భారీ హిట్ కు శ్రీకారం చుట్టబోతున్నాడు. ఓమ్ రౌత్ డైరెక్ట్  చేసిన ఈ చిత్రాన్ని తో సిరీస్, భూషణ్ కుమార్ అండ్ కృష్ణన్ కుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్ లు యూ.వి క్రియేషన్స్ బ్యానర్ తో కలిసి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News