Sunday, December 22, 2024

శ్రీరామనవమి కానుకగా..

- Advertisement -
- Advertisement -

ప్రభాస్ హీరోగా నటిస్తున్న మైథాలజికల్ ఎంటర్‌టైనర్ ‘ఆదిపురుష్’ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో థియేటర్లలో విడుదల కాబోతోంది. ప్రభాస్ రఘు రాముడు పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నాడు. ఇక హనుమంతుడి పాత్రలో దేవదత్తా నాగే నటిస్తున్నాడు.

ఇక ఈ భారీ బడ్జెట్ సినిమాలో రావణాసుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా త్రీడి ఇమేజింగ్ కోసం వాయిదా పడిందని ఒక ప్రచారం అయితే ఉంది. అయితే ఈనెల 30న శ్రీరామనవమి సందర్భంగా మేకర్స్ ఒక స్పెషల్ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడాల్సి ఉంది. ఈ సినిమాని 3డీ ఫార్మాట్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News