Wednesday, January 22, 2025

‘అవెంజర్స్’ తరహాలో గొప్పగా ‘ఆదిపురుష్’

- Advertisement -
- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణ మహా గ్రంధం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. శుక్రవారం విడుదలైన ఈ సినిమా విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఇక 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకి మార్నింగ్ షో నుంచే మంచి స్పందన వస్తూ ఉండటంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ వేడుకలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్ శశి మాట్లాడుతూ “ఈ సినిమా ఖచ్చితంగా నైజాంలో టాప్ త్రీ మూవీలో ఒకటి అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను.

ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. సినిమాకి మొదటి రోజు నుంచే ఫ్యామిలీస్ రావడం అనేది రామాయణం గొప్పతనం. నైజాంలో మల్టీప్లెక్స్ పరంగా చూస్తే 1000 స్క్రీన్‌కి పైగా ప్రదర్శించిన సినిమా ఇదే”అని అన్నారు. వివేక్ కుచిబొట్ల మాట్లాడుతూ “రామాయణం సినిమాకి ఫాన్స్ నుంచి ఇంత సపోర్ట్ రావడం సంతోషం. ఒక అవెంజర్స్, ఒక హాలీవుడ్ సినిమా ఎలా ఉంటుందో అంత గొప్పగా గ్రాఫిక్స్‌తో ఈ సినిమాని దర్శకుడు తీశారు. మన రామాయణ కథను తర్వాత తరాల వారికి అలానే ఇప్పటి తరానికి చాలా సులభంగా అర్థమయ్యేలాగా తీసి దర్శకుడు గొప్ప ప్రయత్నం చేశారు” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యు.వి. క్రియేషన్స్ వంశీకృష్ణ రెడ్డి, పీపుల్స్ మీడియా కృతి ప్రసాద్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News