Saturday, December 21, 2024

‘ఆదిపురుష్’ మ్యాజిక్ ఫిల్మ్ అవుతుంది

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న మైథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’. ఈ సినిమాలో శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్, లంకేషుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. దసరా కానుకగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయగా, గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో 3డి టీజర్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్, దిల్‌రాజు, ఓంరౌత్ తదితరులు పాల్గొన్నారు. ప్రభాస్ మాట్లాడుతూ “ఆదిపురుష్ టీజర్‌ను నేను తొలిసారి 3డిలో చూసినప్పుడు చిన్న పిల్లాడిలా అయిపోయా.

అభిమానుల కోసం ఈ టీజర్‌ను 60 థియేటర్లలో ప్రదర్శిస్తాం” అని అన్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ “ఆదిపురుష్ టీజర్ కోసం అందరితో పాటు నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాను. టీజర్ రాగానే నేనూ మొదట ఫోన్‌లోనే చూశాను. అద్భుతంగా ఉంది. ఇలాంటి సినిమాలను థియేటర్లలోనే చూడాలి. విఎఫ్‌ఎక్స్ సినిమాలను థియేటర్‌లో చూస్తే అద్భుతంగా ఉంటాయి. 3డిలో ‘ఆదిపురుష్’ టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా ఒక మ్యాజిక్ ఫిల్మ్ అవుతుందని నేను అనుకుంటున్నా”అని తెలిపారు.

‘Adipurush’ Movie Team Press Meet in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News