Sunday, December 22, 2024

‘ఆదిపురుష్’ టీజర్ వచ్చేది అప్పుడే

- Advertisement -
- Advertisement -

Adipurush movie Teaser to be out on Oct 2

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కృతి సనన్ నాయికగా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ‘ఆదిపురుష్’ అప్‌డేట్ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ సినిమా టీజర్ రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం ప్రకటించింది. అక్టోబర్ 2న శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో ‘ఆదిపురుష్’ టీజర్ విడుదల వేడుక జరగనుంది. ప్రభాస్, కృతి సనన్, దర్శకుడు ఓంరావత్‌తో పాటు ఇతర చిత్రబృందం పాల్గొననుంది. వచ్చే ఏడాది సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 12న ‘ఆదిపురుష్’ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.

Adipurush movie Teaser to be out on Oct 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News