Wednesday, December 18, 2024

సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ‘ఆదిపురుష్‌’

- Advertisement -
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న అత్యంత క్రేజీ ప్రాజెక్టు ‘ఆదిపురుష్‌’. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో మైథలాజికల్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న మూవీలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్‌ సీతగా నటిస్తుండగా.. రావణాసురుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటించాడు. ఈ చిత్రాన్ని టీ సిరీస్‌, రెట్రో ఫైల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను తీసుకువస్తున్నట్లు తెలుపుతూ.. ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. అయితే, టీజర్ కు అద్భుత స్పందన వచ్చినా, వీఎఫ్‌ఎక్స్‌పై సినీ ప్రేక్షకులతోపాటు అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. దీనికంటే వీడియో గేమ్‌ వీఎఫ్‌ఎక్స్ బాగున్నాయని కామెంట్స్‌ చేశారు. దీంతో చిత్రబృందం వీఎఫ్‌ఎక్స్‌ని మెరుగ్గా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీఎఫ్‌ఎక్స్‌కు మరింత సమయం పడుతుండడంతో మూవీ విడుదల తేదీని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కలిగించేందుకు చిత్రబృందం కృషి చేస్తుందని, దానికి మరింత సమయం కావాలని.. అందుకే ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి కాకుండా జూన్ 16న విడుదల చేయనున్నట్లు దర్శకుడు ఓం రావత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

‘Adipurush’ movie to postponed to 2023 June 16

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News