Monday, December 23, 2024

ముందుగా అనుకున్న సమయానికే..

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ సినిమాల్లో విడుదలకు సిద్ధమైన చిత్రం ఆదిపురుష్ కూడా ఒకటి. ఈ భారీ సినిమాను దర్శకుడు ఓంరౌత్ రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించాడు. అయితే, భారీ విజువల్స్ తో కూడిన సినిమాగా దీనిని తెరకెక్కించగా టీజర్‌లో షాకింగ్ విజువల్స్‌తో నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో మేకర్స్ గ్రాఫిక్స్ వర్క్‌ను మళ్లీ చేస్తూ బిజీగా ఉన్నారు.

అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో ఫిల్మ్‌మేకర్స్ క్లారిటీతో ఉన్నారు. ప్రభాస్ ‘ఆదిపురుష్’ని ఎట్టి పరిస్థితుల్లో ముందుగా అనుకు న్నట్టుగా జూన్‌లో రిలీజ్ చేయాలని సూచించాడట. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించగా సీతాదేవిగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ్ దత్త కనిపించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News