Sunday, December 22, 2024

వరల్డ్ ఈవెంట్‌గా ట్రైలర్ లాంచ్..

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ మూవీ ట్రైలర్ లాంచ్‌కు వేళయింది. మే 9న గ్లోబల్ ట్రైలర్ లాంచ్‌తో చరిత్ర సృష్టించడానికి ఈ మూవీ సిద్ధంగా ఉంది. ఈ మెగా ట్రైలర్ లాంచ్‌ను ప్రకటిస్తూ ఈ సినిమా నుంచి ప్రభాస్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మాగ్నమ్ ఓపస్ ఇప్పటికే న్యూయార్క్‌లోని ట్రిబెకా ఫెస్టివల్‌లో అంతర్జాతీయ ప్రీమియర్‌కు సెలెక్ట్ కావడం ద్వారా ఓ గొప్ప మైల్ స్టోన్‌ను సాధించింది. ఇక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల కోసం అద్భుతమైన ట్రైలర్‌తో సిద్ధమైంది. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలలో ఈ ట్రైలర్‌ను రికార్డ్ స్థాయిలో లాంచ్ చేయబోతున్నారు. అందుకే ఇది వరల్డ్ ఈవెంట్‌గా మారింది.

భారతదేశంతో పాటు సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, మయన్మార్, శ్రీలంక, జపాన్, యూఎస్‌ఏ, కెనడా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్రికా, రష్యా, ఈజిప్ట్ దేశాల్లో ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ జరగబోతోంది. ఈ గొప్ప భారత ఇతిహాస కథ ప్రపంచ ప్రేక్షకులను ఓ సాహసోసేతమైన యాక్షన్ ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆదిపురుష్’ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News