Wednesday, January 22, 2025

హృదయాలను తాకే ‘రామ్ సీతా రామ్…’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సీతారాములుగా ప్రభాస్, కృతిసనన్ ద్వయం నటించిన ఆదిపురుష్ చిత్రం నుంచి అద్భుతమైన పాట విడుదలైంది. రాఘవ్, జానకిల మంత్రముగ్ధులను చేసే కథతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ చిత్రం నుంచి రాఘవ్, జానకిల ప్రేమలోని గాఢతను తెలియజేసేలా సాగే మెలోడియస్ జర్నీ ‘రామ్ సీతా రామ్’ పాట పూర్తి ట్రాక్‌ను విడుదల చేసింది మూవీ టీమ్.

సచేత్-పరంపర స్వరపరచిన ఈ గీతం మధురమైన స్వరాలతో నెమ్మదిగా సాగుతూ హృదయాలను తాకేలా ఉంది. రామజోగయ్య శాస్త్రి రాసిన సాహి త్యం.. సీతారాముల మధ్య పంచుకున్న లోతైన అనుబంధాన్ని స్పష్టంగా చిత్రీకరిస్తుంది. ఇది సీతారాముల జీవితంలో వారి బంధం ప్రాముఖ్యతను ప్రదర్శిస్తుంది. ఆదిపురుష్ చిత్రం జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News