Monday, December 23, 2024

వారికే నంది అవార్డులు: ఆదిశేషగిరి రావు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: నంది అవార్డులపై నిర్మాత ఆదిశేషగిరి రావు కీలక వ్యాఖ్యలు చేశారు. నంది అవార్డులపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆసక్తి లేదన్నారు. ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు ఫిల్మ్ ఇండస్ట్రీని పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నవారికే అవార్డులు వస్తాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వ అవార్డులకు ప్రాధాన్యత ఉందని తాను అనుకోవడం లేదన్నారు. దివంగత హీరో కృష్ణపై మెమోరియల్ మ్యూజియం ఉందని ఆదిశేషగిరి రావు పేర్కొన్నారు.

ఉత్తమ గుండా, ఉత్తమ రౌడీ అవార్డులు ఇస్తున్నారని నిర్మాత అశ్వనీదత్ దుయ్యబట్టారు. ఉత్తమ సినిమాలకు అవార్డులు ఇచ్చే రోజు మరో రెండేళ్లలో వస్తుందన్నారు. అప్పుడు అందరికీ అవార్డులు వస్తాయని అశ్వనీదత్ తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్న సీజన్ వేరు అని చురకలంటించారు.

Also Read: ఆ రెండు ఓవర్లే కొంపముంచాయి: ధోనీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News