Friday, December 20, 2024

కీలక దశ లోకి ఆదిత్య ఎల్1

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సూర్యుడి రహస్యాల గుట్టు విప్పడానికి ఇస్రో ప్రయోగించిన వ్యోమనౌక ఆదిత్య ఎల్1 కీలక దశ లోకి ప్రవేశించింది. దాదాపు 15 లక్షల కిలో మీటర్ల ప్రయాణం తరువాత తుది దశ లోకి ప్రవేశించింది. భూమికి, సూర్యుడికి మధ్యన ఉన్న లాంగ్రేజ్ పాయింట్ లోకి ఈ నౌకను పంపడం ప్రస్తుతం మిగిలి ఉన్న పని. లాంగ్రేజ్ పాయింట్ అంటే గురుత్వాకర్షణ సమతుల్యతను సూచించే పాయింట్. అయితే అంతకంటే ముందే దీని వృత్తాకార కక్ష లోకి ఆదిత్య ఎల్ 1 ను పంపించడానికి ఇస్రో సిద్ధమౌతోంది. అత్యంత కీలకమైన ఈ ప్రక్రియకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అంతరిక్షం లోని శీతల శూన్యం లో 15 లక్షల కిలోమీటర్లకు పైగా సాగిన ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌక తన ప్రయాణంలో చివరిదశకు చేరుకుంది. 2023 సెప్టెంబరు 2 న శ్రీహరికోట నుంచి ఇస్రో ఈ అంతరిక్ష నౌకను ప్రయోగించింది. అయితే చివరకు ఎల్1 లోకి చొప్పించడం అనేది మిషన్‌లో క్లిష్టమైన దశ. దీనికి కచ్చితమైన మార్గనిర్దేశకత్వం , నియంత్రణ అవసరం.

ఆదిత్య ఎల్1 కొత్త కక్ష లోకి వెళ్లే ముందు నాలుగు భూమి కక్షల్లో తిరిగింది. ఇప్పుడు హాలో కక్ష లోకి ప్రవేశించ వలసి ఉంది. ఈ ప్రక్రియను చాలా క్లిష్టంగా నిర్వహించాల్సి ఉంటుంది. ఎక్కడ తేడా వచ్చినా అసలుకే ముప్పు తప్పదు. అందుకే ఇస్రో శాస్త్రవేత్తలు పకడ్బందీ వ్యూహంతో హాలో ఆర్బిట్ లోకి ఆదిత్య ఎల్1 ను చొప్పించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. హాలో కక్ష లోకి విజయవంతంగా చొప్పించడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. అంతరిక్ష నౌక స్థానం, వేగాన్ని నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. ప్రణాళికా బద్ధమైన మార్గం నుంచి ఏదైనా వ్యత్యాసాలను ఎదుర్కోడానికి ఆన్‌బోర్ట్ థ్రస్టర్లను ఉపయోగించి సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. వీటికి అదనంగా విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనా గ్రాఫ్ (విఇఎల్‌సి), సోలార్ అల్ట్రా వయెలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (ఎస్‌యుఐటి)తో సహా స్పేస్‌క్రాఫ్ట్ సాధనాలు సూర్యుడు విడుదల చేసే తీవ్రమైన రేడియేషన్ ( వికిరణ ) , కణాల నుండి తప్పనిసరిగా రక్షణ పొందాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News