Wednesday, January 22, 2025

సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో సిద్ధం..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : చంద్రయాన్ 3 ప్రయోగాన్ని విజయవంతంగా నెరవేర్చిన ఇస్రో ఇప్పుడు అదే ఉత్సాహంతో సూర్యుడి రహస్యాలను కనుగొనడానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 2 వ తేదీన ఆదిత్య ఎల్1 ప్రయోగం చేపట్టనున్నది. ఈ విషయాన్ని ఇస్రో అధికారి ఒకరు వెల్లడించారు. “ ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)కు తీసుకొచ్చారు. పీఎస్‌ఎల్‌వీ సి 57 వాహకనౌక … ఆదిత్య ఎల్ 1ను మోసుకుని నింగిలోకి దూసుకెళ్లనుంది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ , ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో ఇస్రో సౌర అధ్యయన ప్రక్రియను చేపట్టనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News