Monday, December 23, 2024

ఆదిత్యా ఎల్ 1కు రిహార్సల్ సూరీడు వద్దకు సై సై

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : సెప్టెంబర్ 2న జరిగే ఆదిత్యా ఎల్ 1 అంతరిక్ష ప్రయోగానికి సన్నాహాయక ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సూర్యుడి అధ్యయనానికి, ప్రత్యేకించి బాహ్యవలయం కరోనా అంతర్గత పరిణామాలపై శాస్త్రీయ పరిశీలనకు ఇస్రో ఈ ప్రతిష్టాత్మక ప్రయోగం చేపట్టింది. శ్రీహరికోట స్పేస పోర్టు ప్రయోగవేదిక నుంచి జరిగే పరీక్షకు లాంఛ్ రిహార్సల్స్ పూర్తి చేసినట్లు ఇస్రో నుంచి బుధవారం ప్రకటన వెలువడింది. రాకెట్ అంతర్గత తనిఖీల ప్రక్రియ పూర్తి అయింది. రెండవ తేదీన ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగం ఖరారు చేశారు. విజయవంతం అయిన చంద్రయాన్ 3 తరువాత ఇస్రోకు ఇది మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అవుతోంది.

సోలార్ కరోనాను దూరం నుంచి పరిశీలించడం, సూర్యుడిలోని తుపాన్ల అంతర్గత పరిణామాలను విశ్లేషించుకోవడం ఈ ఆదిత్యా ప్రయోగ కీలక లక్షాలుగా ఉంటాయి. పిఎస్‌ఎల్‌వి సి 57 రాకెట్ నుంచి ఆదిత్యా ఎల్ 1 ప్రయోగం ఉంటుంది. ప్రయోగ నమూనా పరీక్షలు జరిగాయి. దీనికి ముందు రాకెట్ , వ్యోమనౌక పరిస్థితి గురించి తనిఖీలు నిర్వహించడం జరిగిందని ఇస్రో తమ ప్రకటనలో తెలిపింది. పూర్తిగా దేశీయ సంస్థల ప్రమేయంతో చేపట్టిన ప్రాజెక్టుగా ఆదిత్యా ఎల్ 1 నిలుస్తుందని ఇస్రో మరో మారు ఈ ప్రకటనలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News