Sunday, January 19, 2025

చివరి దశకు ఆదిత్య ఎల్1..

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన ఆదిత్య ఎల్ 1 తన ప్రయాణంలో చివరిదశకు చేరుకుంటోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్. సోమనాథ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఉపగ్రహాన్ని ఎల్1 పాయింట్ లో ప్రవేశ పెట్టేందుకు నిర్వహించాల్సిన విన్యాసాలు వచ్చే ఏడాది జనవరి 7 నాటికి పూర్తవుతాయని తెలిపారు. భారత్ నుంచి తొలి రాకెట్ ప్రయోగానికి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరువనంతపురం లోఇ విక్రమ్ సారాభాయ్ స్పేస్‌సెంటర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సోమనాథ్ పాల్గొని మాట్లాడారు. చంద్రయాన్ 3 తర్వాత సెప్టెంబరు 2 న ఆదిత్య ఎల్1 ను ఇస్రో ప్రయోగించిన విషయం తెలిసిందే.

పీఎస్‌ఎల్‌వీ సీ 57 వాహకనౌక ద్వారా ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టారు. సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ఆదిత్య ఎల్1 లక్షం. భారత్ తరఫున సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇదే. భూమి నుంచి 15 లక్షల కిమీ దూరంలో ఉన్న లగ్రాంజ్ పాయింట్1 చేరాక, దాని కక్షలో పరిభ్రమిస్తూ అధ్యయనం మొదలు పెడుతుంది. ఈ వ్యోమనౌక మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లింది. సౌర వాతావరణం , సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇవి కీలక మైన సమాచారాన్ని ఇవి అందించనున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News