Sunday, January 19, 2025

ఇస్రో మరో ఘనత.. లగ్రాంజ్ పాయింట్ చేరిన ఆదిత్య ఎల్1 స్పేస్ క్రాఫ్ట్

- Advertisement -
- Advertisement -

సూర్యుణ్ని అధ్యయనం చేసేందుకు రోదసీలోకి వెళ్లిన ఆదిత్య ఎల్1 స్పేస్ క్రాఫ్ట్ శనివారం లగ్రాంజ్ పాయింట్ 1 కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ట్వీట్ చేసి వెల్లడించడం విశేషం. భూమికి, సూర్యుడికి మధ్య గురుత్వాకర్షణ శక్తి నిష్క్రియగా మారే ప్రదేశాన్ని లగ్రాంజ్ పాయింట్ అంటారు. దానిచుట్టూ ఉన్న హాలో కక్ష్యలో  స్పేస్ క్రాఫ్ట్ ఉండి, అక్కడినుంచి సూర్యుణ్ని అధ్యయనం చేసి ఆ సమాచారాన్ని ఇస్రోకు అందజేస్తుంది.

ఈ వ్యోమనౌకను తుది కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో చేసిన కృషి ఫలించింది. ఇస్రో గత సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని చేపట్టింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏడు పేలోడ్లను తనతోపాటు తీసుకువెళ్లింది. ‘భారత్ మరో ఘనతను సాధించింది. మనం దేశం రూపొందించిన మొట్టమొదటి సౌలార్ అబ్జర్వేటరీ గమ్యస్థానాన్ని చేరుకుంది. మన శాస్త్రవేత్తల కృషికీ, అంకితభావానికీ ఇది నిదర్శనం. వారికి నా అభినందనలు’ అని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News