Monday, December 23, 2024

నాలుగో ప్రక్రియ హిట్.. ఆదిత్యా మరింత హైట్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : ఇస్రో చేపట్టిన ఆదిత్యా ఎల్ 1 సూర్యుడి వలయాల విశ్లేషణల దిశలో విజయవంతంగా పరిభ్రమిస్తోంది. దీనికి సంబంధించి శుక్రవారం తెల్లవారుజామున దీని కక్ష పెంపు దశలో నాలుగోసారి జరిపిన ప్రక్రియ విజయవంతం అయింది. ఈ విషయాన్ని ఇక్కడి ఇస్రో భూతల కేంద్రం అధికార వర్గాలు తెలిపాయి. సూర్యుడి పరిశోధనలకు సంబంధించి నిర్ణీత లాగ్రాంజే పాయింట్ (ఎల్1 పాయింట్) కు చేరుకోవడానికి ఆదిత్యా ఎల్ 1 కక్షను దశల వారిగా నిర్ధేశితంగా పెంచుతూ పోవడం కీలకమైన విషయం. కక్ష ఎత్తును పెంచే నాలుగో దశ ఇప్పుడు విజయవంతం అయిందని, దీనితో ఆదిత్యా ఎల్ 1 ఇప్పుడు 256 కిమీ -/121973 కిమీల కొత్త కక్షలోకి చేరిందని ఇస్రో తెలిపింది.ఈ కక్ష పెంపుదల ఆపరేషన్‌ను మారిషస్, బెంగళూరు, షార్, పోర్టుబెయిర్‌లలోని ఇస్రో కేంద్రాలు ఈ శాటిలైట్‌ను ట్రాక్ చేసినట్లు, సంబంధిత ఫోటోలను తీసినట్లు వెల్లడించారు.

ఇక ఇప్పుడు ఆదిత్యా ఎల్ 1 కోసం ఫిజి దీవులలో ఏర్పాటు చేసిన సంచార టర్మినల్ ద్వారా ఎప్పటికప్పుడు ఇంధన జ్వలిత చర్యలు ఉంటాయి. ఈ వరుసలో మరో అంటే ఐదవ సారి కక్షపెంపుదల ప్రక్రియ ఈ నెల 19న జరుగుతుందని వివరించారు. సెప్టెంబర్ 2న భారతీయ కాలమానం ప్రకారం 02ః 00 గంటలకు ఈ పెంపుదల ప్రక్రియ ఉంటుంది. ౩ఆదిత్యా ఎల్ 1 వ్యోమనౌక భూమి చుట్టూ 16 రోజుల పాటు తిరుగుతుంది. ఈ దశలో దీని కక్షలను పెంచడం అత్యంత కీలకమైన అంశం అవుతుంది. ఇప్పుడు విజయవంతంగా జరిగిన నాలుగవ కక్ష హెచ్చింపు ప్రక్రియ తరువాత జరిగే ప్రక్రియ అత్యంత కీలకమైనది. అప్పుడు ఆదిత్యా ఎల్1 నౌకను భూ కక్ష నుంచి నిర్ణీత లాగ్రాంజే పాయింట్ దిశకు వెళ్లే కక్షలోకి ప్రవేశపెడుతారు. అప్పుడు ఎల్ 1 పాయింట్‌కు చేరుకునే నిర్ణీత లక్షంలో ప్రయాణం ఆరంభమవుతుంది.

ఎల్ 1 పాయింట్‌కు చేరిన తరువాత తిరిగి మరోసారి జరిగే ప్రక్రియతో ఈ పాయింట్ చుట్టూ పరిభ్రమించే స్థాయికి ఆదిత్యా ఎల్ 1 చేరుకుంటుంది. భూమికి సూర్యుడికి మధ్య సమతూక ఆకర్షణల శక్తి ఉండే ఈ శూన్య స్థితి ప్రాంతం నుంచి ఆదిత్యా ఎల్ 1 జనవరి లేదా ఫిబ్రవరిలలో తన పరిశీలన ఆరంభిస్తుంది. ఇస్రోకు చెందిన విశ్వసనీయ పిఎస్‌ఎల్‌వి సి 57 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఆదిత్యా ఎల్ 1 రాకెట్‌ను ఈ నెల 2వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) రెండో లాంఛ్ ప్యాడ్‌నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఇప్పుడు ఈ రాకెట్ నిర్ణీత కక్షలలో తిరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News