Monday, December 23, 2024

ఆదిత్య ఎల్1 రెండోసారి కక్ష్య పెంపు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని నిర్దేశిత భూకక్ష లో ప్రవేశ పెట్టిన ఇస్రో మంగళవారం రెండోసారి కక్ష్య పెంపు ప్రక్రియను నిర్వహించింది. ప్రస్తుతం 282×40225 కిమీ కక్ష లోకి ఉపగ్రహం ప్రవేశించినట్టు తెలిపింది. బెంగళూరు లోని ‘ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్’ నుంచి ఈ విన్యాసం చేపట్టినట్టు ట్వీట్ చేసింది. ఆ సమయంలో ఉపగ్రహాన్ని మారిషస్, బెంగళూరు, పోర్ట్‌బ్లెయిర్ లోని ఇస్రో గ్రౌండ్ స్టేసన్ల నుంచి ట్రాక్ చేసినట్టు పేర్కొంది. ఆదివారం తొలికక్ష పెంపు ప్రక్రియను నిర్వహించిన విషయం తెలిసిందే. తదుపరి విన్యాసం సెప్టెంబరు 10 వేకువ జామున 2.30 గంటలకు నిర్వహించనున్నట్టు వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News