Monday, December 23, 2024

ఇక సూర్యుడిపై గురి: సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 ప్రయోగం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం అయిన తర్వాత తన తదుపరి ప్రాజెక్టును ఇస్రో సోమవారం ప్రకటించింది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌకను సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది.

భూమికి 15 లక్షల కిలమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడిని అధ్యనం చేయడానికి ప్రత్యేకంగా ఆదిత్య ఎల్1 అంరిక్ష నౌకను ఇస్రో నిర్మించింది. పిఎస్‌ఎల్‌విసి57 రాకెట్ ద్వారా ఈ అంరిక్ష నౌకను ప్రయోగించనున్నట్లు సోషల్ మీడియా పోస్టులో ఇస్రో తెలిపింది. భారత ప్రభుత్వ రంగ సంస్థల భాగస్వామ్యంతో పూర్తి స్వదేశీ పరిజ్ఙానంతో ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌక రూపొందింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News