Friday, December 20, 2024

ఆదిత్యా ఎల్1 దిశలో సర్దుబాటు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : ఇస్రో మరో ప్రతిష్టాత్మక సూర్యమండల పరిశోధనల ప్రయోగం ఆదిత్యా ఎల్ 1 సంబంధిత కీలక ట్రాజెక్టరీ కరెక్షన్‌ను చేపట్టింది. ఇస్రోకు ఇది తొలి సోలార్ మిషన్‌గా నిలిచింది. ఇప్పుడు సూర్యుడి వలయాల పరిశోధనలకు లగ్రాంజ్ పాయిట్ వద్దకు వెళ్లుతున్న ఆదిత్యా ఎల్ 1 ఉపగ్రహానికి సంబంధించి మార్గాన్ని సరిదిద్దే ఈ ట్రాజెక్టరీ కరెక్షన్ ప్రక్రియ ఈ నెల 6వ తేదీన విజయవంతం అయినట్లు ఇస్రో ఆదివారం తెలిపింది. 16 సెకండ్ల పాటు ఈ ప్రక్రియ సాగింది. ఇప్పుడు ఆదిత్యా ఎల్ 1 సజావుగా నిర్ణీత మార్గంలో వెళ్లుతోందని ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు చేపట్టిన ప్రక్రియను సంక్షిప్తంగా టిసిఎం అని వ్యవహరిస్తారు. ఇప్పుడు వ్యోమనౌక సూర్యుడు భూమి మధ్యలో ఉండే గురుత్వాకర్షణ రహిత ఎల్1 పాయింట్ వైపు దూసుకువెళ్లుతోంది. గత నెల 19న ఇటువంటి ప్రక్రియనే నిర్వహించారు. అప్పుడు సరైన దిశలోనే ఈ వ్యోమనౌక సాగింది. అయితే ఇప్పుడు దీనిని తిరిగి పరిశీలించిన తరువాత మరోదఫా దీని మార్గాన్ని సక్రమరీతిలోకి తీసుకుని రావాల్సిన అవసరం ఉందని గుర్తించారు.

అందుకే ఇప్పుడు టిఎంసిని చేపట్టారని ఇస్రోవర్గాలు తెలిపాయి. ఇప్పుడు ప్రయాణం సజావుగా ఉందని, తిరిగి మాగ్నోమీటర్‌ను పరిస్థితిని బట్టి తిరిగి వచ్చే కొద్దిరోజులలో తిరిగి ఆన్ చేస్తారని వివరించారు. సెప్టెంబర్ 2వ తేదీన ఆదిత్యా ఎల్ 1ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఈ స్పేస్‌క్రాఫ్ట్ భూమి నుంచి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంది. అప్పుడిది నిర్ణీత శూన్య స్థితి కక్షలోకి లగ్రాంజె పాయింట్ ఎల్1 దరిదాపుల్లోకి చేరుతుంది. ఇందుకు 125 రోజులకు పైగా సమయం పడుతుంది. అక్కడికి చేరుకున్న తరువాత దీని ద్వారా ముందుగా ఎంచుకున్న పరిశోధనలకు వీలేర్పడుతుంది. సూర్యుడి చుట్టూ ఉండే జ్వాలల వలయం, సౌర తుపాన్లు వంటి విషయాలపై ఈ మిషన్ ద్వారా అధ్యయనాలు చేస్తారు. అంతేకాకుండా ఇంతవరకూ ఎప్పుడూ వెలువడని రీతిలో సూర్యుడి ఛాయాచిత్రాలు భూ కేంద్రానికి అందుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News