Monday, December 23, 2024

భారత్ జోడో యాత్రలో ఆదిత్య థాకరే

- Advertisement -
- Advertisement -

 

ముంబయి: నేతృత్వంలో నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో శివసేన ఉద్ధవ్ తనయుడు ఆదిత్య థాకరే సోమవారం రాత్రి మహారాష్ట్రలో ప్రవేశించిన అనంతరం ఆదిత్య యాత్రలో పాల్గొంటారని థాకరే సారథ్యంలోని వర్గంతెలిపింది. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో సేన నేత సచిన్ అహిర్ మాట్లాడుతూ ఆదిత్యథాకరే కాంగ్రెస్ యాత్రలో ఆదిత్య పాల్గొనే అవకాశం ఉందన్నారు.

తమ పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరేతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామనితెలిపారు. ప్రజలందరిని ఏకతాటిపైకి తేవాలన్న ఆలోచనతో నిర్వహిస్తున్న జోడో యాత్రకు అన్నివర్గాల నుంచి మద్దతు లభిస్తుందని సేన ఎంఎల్‌సి అహిర్ అన్నారు. కాగా మహారాష్ట్రకు సరిహద్దులోని తెలంగాణ నాందేడ్ జిల్లా డెగ్లూర్ నుంచి భారత్ జోడో యాత్ర సోమవారం రాత్రి ప్రవేశిస్తుంది. మహారాష్ట్రలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, 6పార్లమెంటు నియోజకవర్గాల్లో 14రోజులపాటు యాత్ర కొనసాగనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News