Monday, December 23, 2024

ఘనంగా ఆదివాసీ గిరిజన దినోత్సవం

- Advertisement -
- Advertisement -

వరంగల్ : అంతర్జాతీయ ఆదివాసీ గిరిజన దినోత్సవం సం దర్భంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రే వంత్‌రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం గార్ల మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో మండల కార్యనిర్వాహక అధ్యక్షుడు తాళ్లపల్లి కృష్ణగౌడ్, మాజీ ఎంపీపీ మాలోతు వెంకట్‌లాల్, మండల నాయకులు గుండా వెంకట్‌రెడ్డి, జాతీయ అవార్డు గ్రహీత శంషాద్ బేగం సేవాలాల్ మహారాజ్, భా రతరత్న ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం కొమురం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఆ దివాసీ దినోత్సవాన్ని జరపాలని కాంగ్రెస్ పిలుపు మేరకు ఆదివారీ గిరిజన ప్రాంతంలో ఉన్న వారందరికీ మేమున్నామని కాంగ్రెస్ భరోసా కల్పిస్తూ రాబోయే రోజుల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులందరికీ 10 ఎకరాల వరకు పట్టాలు ఇస్తామన్నారు. పోడు భూమి రైతుల జోలికి వచ్చే బీఆర్‌ఎస్, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.

1/70, పిసా చట్టాన్ని పకడ్బంధీగా అమలుచేస్తామని, ఆదివాసీ గిరిజన తెగలకు రావల్సిన అభివృద్ధి ఫలాలను నేరుగా వారికి అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వెంకన్న, మోహన్‌నాయక్, కిషోర్‌నాయక్, హరినాయక్, కుమార్‌గౌడ్, జన్నయ్య, వినోద, వెంకటేశ్వర్లు, కిషన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News