- Advertisement -
ఢిల్లీ: ఆదివాసీ మహిళ అత్యున్నత పీఠం అధిరోహించడం చారిత్రాత్మకమని గరవర్నర్ తమిళి సై తెలిపారు. నామినేషన్ రోజు వరదల కారణంగా ఢిల్లీ వెళ్లలేకపోయానని గవర్నర్ పేర్కొన్నారు. ఇటీవల వరద బాధితుల్ని పరామర్శించారు. తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్షంగా పని చేస్తున్నానని వెల్లడించారు. వరద ప్రాంతాల్లో తాను పర్యటించినప్పుడు అధికారులు కూడా రాలేదని తమిళి సై అవేదన వ్యక్తం చేశారు. తాను రాష్ట్రానికి ప్రథమ పౌరురాలిని కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్లానని, ఆదివాసీలు ఉన్న ప్రాంతాలు కాబట్టి భద్రాచలం ప్రాంతానికి వెళ్లానని, కేంద్ర ప్రభుత్వం తప్పకుండా రాష్ట్రానికి సహాయం చేస్తుందన్నారు. గతంలో వరదలు వచ్చినప్పుడు కేంద్రం సహాయం చేసిందన్నారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మూ ప్రమాణ స్వీకారోత్సవంలో గవర్నర్ పాల్గొన్నారు.
- Advertisement -