Saturday, December 21, 2024

అడివి శేష్, శృతి హాసన్ కాంబినేషన్‌లో మెగా పాన్-ఇండియా యాక్షన్ డ్రామా  

- Advertisement -
- Advertisement -

ఈ సీజన్‌లో బిగ్గెస్ట్ మూవీ అనౌన్స్‌మెంట్ ఇప్పుడే రావడంతో క్రిస్మస్ ముందుగానే వచ్చింది. సూపర్ స్టార్స్ అడివి శేష్, శృతి హాసన్ మెగా పాన్-ఇండియా యాక్షన్ డ్రామాలో నటించబోతున్నారని మేకర్స్ మంగళవారం అనౌన్స్ చేశారు. అడివి శేష్ 2022లో చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ‘మేజర్’ బ్లాక్ బస్టర్ విజయంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు చేస్తున్న ఇంకా టైటిల్ రివిల్ చేయని ఈ మ్యాసివ్ ప్రాజెక్ట్ అడివి శేష్ కు రెండో స్ట్రయిట్ హిందీ మూవీ కానుంది.

ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ముఖ్య్యమైన వివరాలు, క్యారెక్టర్ పోస్టర్‌లు, టైటిల్ తో సహా సినిమాకి సంబధించిన కీలకమైన విషయాలని రాబోయే రోజుల్లో ప్రేక్షకులకు పరిచయం చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్‌లో పుట్టి పెరిగిన షానెల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు.

అడివి శేష్ ‘క్షణం’, ‘గూఢచారి’ తో సహా పలు తెలుగు బ్లాక్‌బస్టర్‌లకు గతంలో డీవోపీగా పనిచేసిన షానీల్ కు దర్శకుడిగా ఇది తొలి  చిత్రం. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు అధికారికంగా ఎంపికైన ‘లైలా’ అనే ప్రశంసలు పొందిన షార్ట్ ఫిల్మ్ కు ఆయన దర్శకత్వం వహించారు. “సినిమాలోని ప్రతి ఫ్రేమ్, డైలాగ్, సన్నివేశాన్ని హిందీతో పాటు తెలుగులో విడివిడిగా చిత్రీకరిస్తున్నాం. ప్రతి భాష సాంస్కృతిక ప్రత్యేకత బట్టి దీనిని విభిన్నంగా ట్రీట్ చేస్తున్నాం” అని మేకర్స్ అనౌన్స్ మెంట్ లో దృవీకరించారు. ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ-నిర్మాత. అడివి శేష్ , షానీల్ డియో కలిసి కథ, స్క్రీన్ ప్లే సమకూర్చారు. ప్రాజెక్ట్ గురించిన మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News