Wednesday, January 22, 2025

సెప్టెంబర్ 29న సోనీ లైవ్ లో అదియే మూవీ స్ట్రీమింగ్..

- Advertisement -
- Advertisement -

విమర్శకులు, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని ఆకట్టుకునే ఐఎండిబి రేటింగ్ 7.6 సంపాదించిన తర్వాత, తమిళ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘అదియే’ సెప్టెంబర్ 29న సోనీ లైవ్ లో ఓటిటి ప్రీమియర్‌గా ప్రదర్శితం కానుంది. ఈ చమత్కారమైన కథలో, ప్రాణాంతకంగా మారిన ప్రమాదం కథానాయకుడు జీవాను ఆల్టర్నేట్ రియాలిటీ ప్రపంచంలోకి నెట్టివేస్తుంది. కానీ విధి జోక్యం చేసుకొని, తిరిగి అతన్ని రియాలిటీలోకి లాగుతుంది.

విఘ్నేష్ కార్తీక్ రచించి, దర్శకత్వం వహించగా, ప్రభా ప్రేమ్‌కుమార్ నిర్మించిన ఆదియేలో జి వి ప్రకాష్ కుమార్, గౌరీ కిషన్, వెంకట్ ప్రభు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించారు. రొమాన్స్, కామెడీ సైన్స్ ఫిక్షన్‌తో మిమల్ని అలరించడానికి ఆదియే సోనీ LIVలో మాత్రమే ప్రసారం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News