Wednesday, January 22, 2025

ఫొగాట్ అభ్యర్థనపై తీర్పు వాయిదా

- Advertisement -
- Advertisement -

పారిస్ : భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అప్పీల్‌పై నిర్ణయాన్ని ఈనెల 13న (మంగళవారం) ప్రకటించనున్నట్లు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోరట్స్ (సిఎఎస్) ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. వినేశ్ అభ్యర్థనపై చర్చించేందుకు మరింత సమయం పడుతుంద ని, క్షుణ్ణంగా చర్చించి 13న తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు సిఎఎస్ పేర్కొంది. 100 గ్రాముల అదనపు బరువు కారణంగా వినేశ్‌ను ఫైనల్‌కు సస్సెన్షన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం తీర్పు వెలువడుతుందని భార త ఒలింపిక్ సంఘం శనివారం సాయంత్రం తె లిపింది. మొదట శనివారం సాయంత్రం తీర్పు వెల్లడిస్తామని ప్రకటించిన సిఎఎస్ చివరి క్షణం లో వాయిదా వేసింది. ఒలింపిక్స్ ముగిసేలోపు తుది నిర్ణయాన్ని వెలువరిస్తామని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News