- Advertisement -
ఢిల్లీ: పార్లమెంటు ఉభయసభలు మధ్యాహ్నం 12 వరకు వాయిదా పడింది. నీట్ పరీక్ష పత్రాల లీకేజీపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. నీట్‌పై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా తిరస్కరించారు. విపక్ష సభ్యుల నినాదాలతో పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్ సభలో నీట్‌పై గౌరవప్రదమైన చర్చ జరగాలని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపి రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. నీట్ అంశంపై ప్రధాని మోడీ కూడా చర్చలో పాల్గొన్నాలని, నీట్ అనేది లక్షలాది మంది యువతకు సంబంధించిన అంశం అని, నీట్‌పై చర్చకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని రాహుల్ కోరారు.
- Advertisement -