Thursday, January 23, 2025

పార్లమెంట్ ఉభయసభలు వాయిదా

- Advertisement -
- Advertisement -

శుక్రవారం ఉదయం 11 గంటలకు పార్లమెంటు కార్యకలాపాలు ప్రారంభం కాగానే, లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే వాయిదా పడ్డాయి. లోక్‌సభ, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. సభలు మధ్యాహ్నం 2 తర్వాత తిరిగి ప్రారంభం కానున్నాయి. మరోవైపు సభాకార్యక్రమాలకు అంతరాయం కలిగించినందుకు సస్పెండ్ అయిన ఎంపీలు నిరసనకు దిగారు. పార్లమెంట్‌ బయట నిరసన తెలుపుతున్న సస్పెండ్ ఎంపీలతో సోనియా గాంధీ సమావేశమయ్యారు. మొత్తం 14 మంది ఎంపీలు – లోక్‌సభ నుండి 13 మంది రాజ్యసభ నుండి ఒకరిని నిన్న సస్పెండ్ చేశారు. భద్రతా ఉల్లంఘన ఘటనపై ప్రతిపక్ష ఎంపీల నినాదాల మధ్య లోక్‌సభ వాయిదా పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News