Wednesday, January 22, 2025

ఈ రోజు రాలేను..సోమవారం వస్తా: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మంత్రి కొండా సురేఖపై కెటిఆర్ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌పై విచారణను ఈ నెల 23కు నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. శుక్రవారం కెటిఆర్ కోర్టు ఎదుట వాగ్మూలం ఇవ్వాల్సి ఉండగా వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నారని అయన తరపు న్యాయవాదులు కోర్టుకు వెల్లడించారు. నేడు వాంగ్మూలం నమోదు చేస్తామని చెప్పినా మళ్లీ సమయం కావాలని ఎలా అడుగుతారని కోర్టు ప్రశ్నించగా సోమవారం లేదా బుధవారం హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో విచారణను ఈ నెల 23కి కోర్టు వాయిదా వేసింది. అదే రోజు ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తామని కోర్టు వెల్లడించింది.

మంత్రి కొండా సురేఖపై కెటిఆర్ ఈ నెల 3న నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఆయన తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. ఈ పిటిషన్‌ను ఈ నెల 14న విచారించిన నాంపల్లి కోర్టు దాన్ని ఈ నెల్ 18వ తేదీకి వాయిదా వేసింది. కెటిఆర్ సహా సాక్షుల వాంగ్మూలాలను ఆరోజు నమోదు చేస్తామని కోర్టు తెలిపింది. ఇటీవల మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ సినీ పరిశ్రమలోని పలువురుని ప్రస్తావిస్తూ కెటిఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేయడంతో తన పరువుకు భంగం కలిగేలా మంత్రి వ్యవహరించారని కెటిఆర్ దావా వేశారు.

ఇటీవల మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ సినీ పరిశ్రమలోని పలువురిని ప్రస్తావిస్తూ కెటిఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి విదితమే. తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని కెటిఆర్, కొండా వ్యాఖ్యలను ఖండించారు. మంత్రి తన పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తూ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనికి సంబంధించి వాంగ్మూలం శుక్రవారం కోర్టులో ఇవ్వాల్సి ఉంది. కెటిఆర్ విజ్ఞప్తి మేరకు న్యాయమూర్తి స్టేట్‌మెంట్ రికార్డును వచ్చే బుధవారానికి వాయిదావేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News