Sunday, December 22, 2024

హైకోర్టులో మేడిగడ్డ బ్యారేజ్‌పై విచారణ వాయిదా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై హైకోర్టులో దాఖలైన పిల్‌‌ శుక్రవారం విచారణకు వచ్చింది. సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు నిరంజన్ హైకోర్టులో పిల్ వేశారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై వివరాలు సమర్పించాల్సిందిగా గతంలోనే తెలంగాణ సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది.

కొంత సమయం కావాలని హైకోర్టును అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోరగా 2 వారాల పాటు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ సమయం ఇచ్చింది. ఇదే సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News