Wednesday, January 22, 2025

లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్ సభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. వర్షాకాల సమావేశాల మొదటి రోజు దిగువ సభ సమావేశమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా రింకూతో ప్రమాణం చేయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన మంత్రివర్గ సహచరులు సభలో ఉన్నందున, స్పీకర్ సిట్టింగ్ ఎంపీలు రత్తన్ లాల్ కటారియా, సురేష్ ధనోర్కర్‌లతో పాటు మాజీ సభ్యులు ప్రకాష్ సింగ్ బాదల్, అతిక్ అహ్మద్‌లకు సంస్మరణ సూచనలను చదివి వినిపించారు. దీంతో వెంటనే సభా కార్యక్రమాలను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. ప్రతిపక్ష సభ్యులు లేచి నిలబడి మణిపూర్ హింసపై చర్చకు ప్రయత్నించారు.

కాంగ్రెస్ ఎంపీలు మనీష్ తివారీ, మాణికం ఠాగూర్‌తో పాటు ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో సహా పలువురు విపక్ష సభ్యులు రాష్ట్రంలోని పరిస్థితిపై చర్చించేందుకు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. అంతకుముందు, ప్రధాని మోడీ సభలోకి ప్రవేశించిన వెంటనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఆమె సీటు దగ్గర మాట్లాడటం కనిపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News