Friday, January 24, 2025

ఉచిత హామీల కేసు విచారణ వాయిదా…

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఉచిత హామీల అమలు సాధ్యాసాధ్యాలపై నిపుణుల కమిటీ ఏర్పాటుకు సుప్రీం కోర్టు ఆదేశించింది. రాజకీయ పార్టీల ఉచిత హామీలపై విచారణను ప్రత్యక్షప్రసారం చేసింది. రాజకీయ పార్టీల ఉచితాలపై త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసింది. 2013 నాటి తీర్పు పునఃపరిశీలనకు సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. ధర్మాసనం ఏర్పాటుపై తదుపరి సిజెఐ నిర్ణయం తీసుకుంటారని జస్టిస్ ఎవి రమణ తెలిపారు. ఉచితాల కేసు విచారణ నాలుగు వారాలపాటు సిజెఐ ధర్మాసనం వాయిదా వేసింది. ప్రత్యక్షప్రసారానికి తొలిసారి సిజెఐ ఎన్‌వి రమణ చర్యలు తీసుకున్నారు. సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా కోర్టు ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం జరిగింది.

సిజెఐ జస్టిస్ ఎన్‌వి రమణ శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస ఎన్‌వి రమణ విశేషమైన సేవలందించారు. న్యాయవాది నుంచి సిజెఐ స్థాయికి రమణ ఎదిగారు. 13 ఏళ్లు ఉమ్మడి ఎపి హైకోర్టుకు జడ్జిగా పని చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2021 ఏప్రిల్‌లో బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ కోకా సుబ్బారావు తరువాత సుదీర్ఘకాలం సిజెఐగా చేసిన తెలుగు వ్యక్తిగా రమణ రికార్డు సృష్టించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News