Friday, November 15, 2024

జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు 14కి వాయిదా

- Advertisement -
- Advertisement -

అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సాధారణ బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా పడింది. ఈ తీర్పును ఈ నెల 14 కి వాయిదా రంగారెడ్డి ప్రత్యేక పోక్సో కోర్టు వాయిదా వేసింది. అయితే ఇటీవల తనకు ఉత్తమ నృత్య దర్శకుడిగా అవార్డు వచ్చిందని, అవార్డు అందుకునేందుకు ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నందున ఈ నెల 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గత సోమవారం రంగారెడ్డి జిల్లా పోక్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. వాదనలు విన్న కోర్టు ఈ నెల 6 నుంచి 9 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

కానీ జానీ మాస్టర్ అందుకోబోయే పురస్కారాన్ని రద్దు చేసినట్లు ఆయనకు తెలియడంతో తనకు మంజూరైన మధ్యంతర బెయిల్‌ను వినియోగించుకోబోనని కోర్టులో మెమో దాఖలు చేశారు. వచ్చిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న జానీమాస్టర్ తనకు రెగ్యులర్ బెయిల్ కావాల్సిందిగా కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. ఈ క్రమంలోనే బెయిల్ పిటిషన్ తీర్పు ఈ నెల 14 కి వాయిదా పడింది. కాగా, జానీ మాస్టర్ చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న విషయం విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News