Thursday, January 23, 2025

జిల్లాలో 200 మంది ఉపాధ్యాయుల సర్దుబాటు

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : జిల్లాలోని వివిధ పాఠశాలల్లో విద్యార్థులు సంఖ్యకు అనుగుణంగా ఉన్న ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో భాగంగా కలెక్టర్ ఉత్తర్వులు, ఆదేశాల మేరకు జిల్లాలో 200మంది ఉపాధ్యాయులు అదనంగా ఉన్న ఉపాధ్యాయులను అవసరమైన పాఠశాలలకు సర్దుబాటు ఉత్తర్వుల ప్రకారం వెంటనే విధుల్లో చేరాలని డిఈఓ గోవిందరాజులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టిన కొత్త ప్రాంతానికి బుధవారం నాటికి ఆయా పాఠశాలల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

సర్దుబాటు చేసిన ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల నుంచి విడుదల కాని పక్షంలో సిసిఏ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి హెచ్చరికలు జారీ చేశారు. సర్దుబాటు ఉత్తర్వులను అమలు చేయని పక్షంలో సంబంధిత మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలే పూర్తిగా బాధ్యులు అవుతారని, సర్దుబాటు ఆదేశాల ప్రకారం విధుల్లో చేరని పక్షంలో అట్టి ఉపాధ్యాయుల జీతభత్యాలను నిలుపుదల చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని డిఈఓ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News