Monday, January 20, 2025

విఆర్వోల సర్దుబాటు

- Advertisement -
- Advertisement -

Adjustment of VROs in other departments

రెవెన్యూ మినహా ఇతర శాఖలకు
బదిలీ జూనియర్ అసిస్టెంట్
హోదాలో పోస్టింగ్ జిఓ 121
జారీ కలెక్టర్లకు బాధ్యతలు

మనతెలంగాణ/హైదరాబాద్ : విఆర్‌ఓలను రెవెన్యూ శాఖ మినహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించిన జీఓ నంబర్ 121ను విడుదల చేసింది. విఆర్‌లో పని చేసేందుకు ఏ ఏ శాఖలో జూనియర్ అసిస్టెంట్ కు సమానమైన శాంక్షన్డ్ పోస్టులు ఎన్ని ఖాళీలున్నాయో వెల్లడిస్తూ సర్క్యులర్ విడుదల చేయడంతోపాటు సోమవారం లక్కీ డిప్ ద్వారా శాఖలు కేటాయించాలని కలెక్టర్‌లను ఆదేశిస్తూ ప్రభుత్వం ఆ జిఓ విడుదల చేసింది. ఉత్తర్వులు అందుకోగానే మంగళవారం మధ్యాహ్నంలోగా ఉద్యోగులు విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇతర శాఖల్లో సర్దుబాటు…
వ్యవసాయం, పశుసంవర్ధక, బిసి, ఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్, అటవీ, ఆర్థిక, సివిల్ సప్లైయ్, వైద్య, ఆరోగ్య, విద్య, హోం, ఇండస్ట్రీస్, ఇరిగేషన్, లేబర్, మైనార్టీ వెల్ఫేర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్, రవాణా, మహిళా,శిశు సంక్షేమ శాఖల్లో విఆర్‌లను కలెక్టర్‌లు సర్దుబాటు చేస్తున్నారు. విద్యార్హతలు, సీనియారిటీ వంటి అంశాలతో సంబంధం లేకుండా లాటరీ పద్ధతిన ఉద్యోగులను ఎంపికచేసి పోస్టింగ్ ఇస్తున్నారు. అధికారుల సమక్షంలో వీడియో చిత్రీకరణతో ఈ ప్రాసెస్‌ను పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆర్థిక శాఖ కార్యదర్శి డి. రోనాల్డ్ రోస్ ఉత్తర్వులు జారీ చేయగా, దాదాపు మెజార్టీ జిల్లాల్లో లాటరీ ద్వారా విఆర్‌ఓల సర్దుబాటు ప్రక్రియ పూర్తి కావొచ్చింది. సెలవు, సస్పెన్షన్ లో ఉన్నవారికి కూడా జిల్లాలు కేటయించాలని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఒక జిల్లాలో పోస్టులు లేకుంటే పక్క జిల్లాలోనైనా పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆ జిఓలో ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News