- Advertisement -
హైదరాబాద్: స్పీకర్ ను ఏకవచనంతో సంబోధించిన బిఆర్ఎస్ ఎంఎల్ఎ జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని అడ్లూరి లక్ష్మణ్ కోరారు. దళిత వర్గానికి చెందిన స్పీకర్ ను అవమానించారని మండిపడ్డారు. జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు స్పీకర్ ను గౌరవించాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. యావత్ దళిత జాతికి జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పై జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై గందరగోళం నెలకొనడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.
- Advertisement -