Tuesday, January 21, 2025

దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలల్లో… ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలోని దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు దివ్యాంగ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించారు. వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్స్ వ్యక్తుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఐదు ఆశ్రమ పాఠశాలలు, ఆశ్రమ జూనియర్ కళాశాలకు 2023-24 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనట్లు ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్ ఫోన్ నెంబర్లను సంప్రదించాలని సూచించారు. హైదరాబాద్, మలక్‌పేటలోని ప్రభుత్వ బదిరుల ఆశ్రమ పాఠశాల ఫోన్ 9440362946, నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆవంతిపురం ఫోన్ 9000013632, కరీంనగర్, విద్యానగర్ ఫోన్ 9000013639, ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలు, కళాశాలలు పిల్లలమర్రి రోడ్, మహబూబ్‌నగర్ ఫోన్ 9618243794, కరీంనగర్ విద్యానగర్ ఫోన్ 9494317315 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News