Friday, November 22, 2024

డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

అంధ విద్యార్థులకు బోధించడానికి సంబంధించి డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్‌లో ప్రవేశాలకు ఆసక్తి, అర్హత గల అభ్యర్థుల నుండి వికలాంగుల సంక్షేమ మంత్రిత్వ శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. 202425 విద్యా సంవత్సరానికి డిఎస్ స్పెషల్ ఎడ్యుకేషన్‌లో ప్రవేశాలు కోరే అభ్యర్థులకు నేరుగా ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు అంధ విద్యార్థుల బోధనకు సంబంధించిన ఉపాధ్యాయ శిక్షణా సంస్థ కొ ఆర్డినేటర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు భారత పునరావాస మండలి(ఆర్‌సిఐ)చే గుర్తించబడింది. ఈ కోర్సును కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ వయోవృద్ధుల సాధికారత శాఖ సమన్వయంతో నిర్వహిస్తోంది. ఇంటర్మీడియట్ బోర్డు గుర్తించిన ఇంటర్మీడియట్,

తత్సమానమైన పరీక్షలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ప్రవేశాలకు అర్హులు, రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్‌ల ప్రకారం ప్రవేశాలు జరుగుతాయి. రెండేళ్ళ కాలపరిమితి గల ఈ కోర్సుకు ఏడాడిదికి కోర్సు ఫీజు రూ.15 వేలు. అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను ఈ నెల 14లోగా దాఖలు చేయాల్సి ఉంటుంది. తరగతులు జులై 12 నుండి ప్రారంభమవుతాయి. ఓసి, బిసి, ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులు రూ.200 చెల్లించి దరఖాస్తు ఫారాలు పొందవచ్చని తెలిపారు. దివ్యాంగ విద్యార్థులకు దరఖాస్తులు ఉచితంగా ఇవ్వబడుతాయి. మరింత సమాచారం కోసం ఫోన్ 9441224540, 9391190121 నెంబర్లకు సంప్రదించవచ్చని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News