Tuesday, November 5, 2024

ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకుంటే మూడో ప్రపంచ యుద్ధమే!?

- Advertisement -
- Advertisement -

Russia's attack

మాస్కో: నాటో లోకి ఉక్రెయిన్‌ను చేరిస్తే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయగలదని ఓ రష్యా ఉన్నతాధికారి తెలిపారు. టాస్ వార్తా సంస్థ గురువారం ఆయనతో ఇంటర్వూ చేసినప్పుడు ఆయన ఈ విషయం తెలిపారు. “నాటోలోకి ఉక్రెయిన్‌ను చేర్చుకుంటే మూడో ప్రపంచ యుద్ధానికి అవకాశం ఉంటుందన్న విషయం కీవ్‌కు కూడాతెలుసు” అని రష్యా సమాఖ్య భద్రతా మండలి డిప్యూటీ సెక్రటరీ అలెగ్జాండర్ వెనెడిక్టోవ్ తెలిపారు. ఉక్రెయిన్ ప్రాంతాలను రష్యా అక్రమంగా ఆక్రమించుకుందన్న ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ముసాయిదా తీర్మానం చేయగా భారత్ ఓటింగ్ నుంచి గైర్హాజరు అయింది. 143 సభ్య దేశాలుండగా ఇండియాతో పాటు 35 దేశాలు గైర్హాజరు అయ్యాయి. ఇదిలావుండగా రష్యా జరిపిన తాజా దాడిలో అవద్వికలోని జనసమర్ధ మార్కెట్‌లో ఏడుగురు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌కు చెందిని తూర్పు దొనెత్సక్ ప్రాంతపు గవర్నర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News